Sridhar Vembu: ఏఐ వచ్చినా ఈ ఉద్యోగాలకు ఢోకా లేదు.. జోహో శ్రీధర్ వెంబు
- ఏఐ యుగంలో సురక్షితమైన ఉద్యోగాలపై జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు విశ్లేషణ
- డబ్బు కన్నా మానవ సంబంధాలు, సంస్కృతి, సేవ ఆధారిత పనులే నిలుస్తాయని వెల్లడి
- ఏఐ సృష్టించే మిగులు సంపద పంపిణీయే భవిష్యత్తులో పెద్ద సవాల్ అని వ్యాఖ్య
- పని ఐచ్ఛికం అవుతుందని మస్క్, ఉద్యోగాల తీరు మారుతుందని హువాంగ్ అభిప్రాయం
- పూజారులు, సంగీత విద్వాంసులు, రైతులు వంటి వృత్తులకు ఆందోళన లేదని స్పష్టం
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వల్ల భవిష్యత్తులో ఉద్యోగాల పరిస్థితి ఏంటనే దానిపై ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చర్చలో జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు మరోసారి తనదైన శైలిలో స్పందించారు. ఏఐ వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ కొన్ని ఉద్యోగాలకు ఎలాంటి ప్రమాదం ఉండదని ఆయన పేర్కొన్నారు. అయితే, ఆయన చెప్పిన జాబితాలో టెక్నికల్ ఉద్యోగాలు కాకుండా మానవ సంబంధాలు, ఆత్మ సంతృప్తినిచ్చే పనులే ఉండటం విశేషం. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో ఒక సుదీర్ఘ పోస్ట్ చేశారు.
ఆర్థిక లాభం లేదా మేధోపరమైన హోదా ఆధారంగా తమ విలువను అంచనా వేసుకుంటే, ఏఐ వల్ల తీవ్రమైన వ్యక్తిగత సంక్షోభం తలెత్తవచ్చని వెంబు హెచ్చరించారు. యంత్రాలు మెరుగవుతున్న కొద్దీ అనేక వైట్ కాలర్ ఉద్యోగాలు ప్రాధాన్యం కోల్పోవచ్చని అన్నారు. అయితే, పిల్లల సంరక్షణ, వృద్ధుల సేవ, యువతకు బోధించడం, ప్రకృతిపై ప్రేమతో ఫారెస్ట్ రేంజర్లుగా పనిచేయడం, భక్తులు ఉన్నా లేకున్నా ఆలయాల్లో పూజలు చేసే పూజారులు, శాస్త్రీయ సంగీత విద్వాంసులు వంటి పనులకు ఢోకా ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. డబ్బును ప్రధాన ప్రేరణగా కాకుండా సంతృప్తి కోసం ఈ పనులను ఎంచుకుంటారని, అందుకే ఏఐ వీరి ఉనికిని దెబ్బతీయలేదని వివరించారు.
అయితే, వెంబు వాదనతో విష్ణు అగర్వాల్ అనే యూజర్ విభేదించారు. సంపద లేనిదే కళలు, సేవలు మనలేవని ఆయన అన్నారు. దీనికి స్పందించిన వెంబు ఏఐ వల్ల వస్తువులు, సేవల ఉత్పత్తి భారీగా పెరుగుతుందని, అసలు సమస్య ఉత్పత్తి కాదని, దాని పంపిణీనేనని స్పష్టం చేశారు. టెక్నాలజీ వల్ల ఏర్పడిన మిగులు సంపదను ప్రజలకు ఎలా పంచాలన్నదే భవిష్యత్తులో రాజకీయ, ఆర్థిక వ్యవస్థల ముందున్న సవాల్ అని పేర్కొన్నారు.
ఈ విషయంలో ఎలాన్ మస్క్, జెన్సెన్ హువాంగ్ వంటి ఇతర టెక్ దిగ్గజాలు కూడా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. భవిష్యత్తులో పని అనేది ఐచ్ఛికం అవుతుందని మస్క్ చెప్పగా, ఏఐ వల్ల ఉద్యోగాలు పోవని.. వాటి స్వరూపం మాత్రమే మారుతుందని హువాంగ్ అభిప్రాయపడ్డారు.