Arvind Kejriwal: కేజ్రీవాల్ కంటతడి పెట్టడంపై స్పందించిన ఢిల్లీ సీఎం రేఖా గుప్తా

Delhi CM Rekha Gupta responds to Kejriwals tears
  • కేజ్రీవాల్‌ది మొసలి కన్నీరు అని విమర్శ
  • 11 ఏళ్ల పాలనలో కేజ్రీవాల్ ఢిల్లీకి చేసిందేమిటి అని నిలదీత
  • కేసు తప్పయితే దర్యాప్తు ప్రారంభం కాగానే పాలసీని ఎందుకు రద్దు చేశారని ప్రశ్న
మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కంటతడి పెట్టుకోవడంపై ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా స్పందించారు. మద్యం కేసులో తనకు క్లీన్ చిట్ రావడంపై కేజ్రీవాల్ ఉద్వేగంతో కంటతడి పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రేఖా గుప్తా మాట్లాడుతూ, కేజ్రీవాల్‌ది మొసలి కన్నీరు అని విమర్శించారు.

11 ఏళ్ల పాలనలో కేజ్రీవాల్ ఢిల్లీకి చేసిందేమిటని ప్రశ్నించారు. లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకున్నారని ఆరోపించారు. మద్యం కేసులో సాక్ష్యాలు మాయం చేశారని ధ్వజమెత్తారు. కేజ్రీవాల్ హయాంలో అన్ని రంగాల్లో అవినీతి జరిగిందని ఆమె అన్నారు.

మద్యం పాలసీ కేసులో సాక్ష్యాలను ఎలా తారుమారు చేశారో ప్రజలకు తెలుసని అన్నారు. మద్యం పాలసీ కేసే తప్పు అయితే దర్యాప్తు ప్రారంభమైన వెంటనే ఆ పాలసీని ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించారు. కోర్టులు కూడా గతంలో ఈ కేసుపై ఆందోళన వ్యక్తం చేశాయని పేర్కొన్నారు. మనీలాండరింగ్ వెలుగు చూసిందని పేర్కొన్నారు. కానీ ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ డ్రామా చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం కేసులో కోర్టులో కచ్చితంగా న్యాయం జరుగుతుందని సీఎం రేఖా గుప్తా ఆశాభావం వ్యక్తం చేశారు.
Arvind Kejriwal
Rekha Gupta
Delhi CM
AAP
liquor scam
corruption
Delhi
liquor policy case
money laundering

More Telugu News