Narendra Modi: మోదీ ఇజ్రాయెల్ పర్యటన.. ‘‘నమస్తే మోదీ’’ అంటూ ఇజ్రాయెల్ పత్రిక స్వాగతం

Narendra Modi visits Israel welcomed by Jerusalem Post
  • మరికాసేపట్లో ఇజ్రాయెల్ లో ల్యాండ్ కానున్న భారత ప్రధాని
  • ప్రత్యేకంగా స్వాగతించిన ‘ద జెరూసలేం పోస్ట్’
  • సెనేట్ లో మోదీ చారిత్రాత్మక ప్రసంగం చేయనున్న మోదీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్‌ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. 2017 తర్వాత ఆయన చేస్తున్న రెండో పర్యటన కావడంతో ఇజ్రాయెల్ ప్రభుత్వం, అక్కడి మీడియా ఘన స్వాగతానికి ఏర్పాట్లు చేశాయి. ముఖ్యంగా ఇజ్రాయెల్ టాప్ వార్తాపత్రిక ‘ద జెరూసలేం పోస్ట్’ ప్రధాని మోదీ గౌరవార్థం ఒక ప్రత్యేక ఫ్రంట్ పేజీని డిజైన్ చేసింది.

పత్రిక ఎడిటర్-ఇన్-చీఫ్ జ్వికా క్లెయిన్ తన ‘ఎక్స్’ ఖాతాలో ఈ స్పెషల్ కవర్‌ పేజీని షేర్ చేశారు. ప్రధాని మోదీ అభివాదం చేస్తున్న ఫోటోతో పాటు ‘‘వెల్కమ్ మోదీ’’, ‘‘నమస్తే’’ అంటూ హెడ్డింగ్స్ ఇచ్చారు. భారత్-ఇజ్రాయెల్ మధ్య బలపడుతున్న మైత్రికి ఇది నిదర్శనమని పత్రిక పేర్కొంది. ఈ పర్యటనలో మోదీ ఇజ్రాయెల్ పార్లమెంట్ ‘నెసెట్’ ను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ గౌరవం దక్కించుకున్న తొలి భారత ప్రధానిగా మోదీ చరిత్ర సృష్టించబోతున్నారు.

ప్రధాని నెతన్యాహుతో కలిసి మోదీ రక్షణ, భద్రత, సైన్స్ అండ్ టెక్నాలజీ, మరియు గాజాలో తాజా పరిస్థితులపై చర్చలు జరపనున్నారు. అలాగే ఇజ్రాయెల్ లోని హోలోకాస్ట్ మెమోరియల్ ‘యాద్ వాషెమ్’ను కూడా సందర్శిస్తారు. పర్యటన షెడ్యూల్ (భారత కాలమానం).. మధ్యాహ్నం 4:00 గంటలకు మోదీ ఇజ్రాయెల్‌ లో అడుగుపెడతారు. సాయంత్రం నెసెట్ లో ప్రసంగిస్తారు. రేపు ఉదయం ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్‌తో భేటీ మరియు కీలక ఒప్పందాలపై ప్రధాని మోదీ సంతకాలు చేస్తారు.
Narendra Modi
Israel visit
Namaste Modi
Jerusalem Post
Benjamin Netanyahu
India Israel relations
Isaac Herzog
Israel Parliament
defence
Gaza

More Telugu News