Bangladesh: భారత్ తో సంబంధాల్లో కొత్త మలుపు: వీసా సేవలను పునఃప్రారంభించిన బంగ్లాదేశ్
- ఢిల్లీలో వీసా సేవలను ప్రారంభించిన బంగ్లాదేశ్
- ప్రధానిగా తారిఖ్ రెహమాన్ బాధ్యతలు చేపట్టిన మూడు రోజుల్లోనే కీలక నిర్ణయం
- త్వరలోనే బంగ్లాదేశ్ లో వీసా సేవలను ప్రారంభించనున్న భారత్
ఢిల్లీలోని బంగ్లాదేశ్ రాయబార కార్యాలయం శుక్రవారం నుంచి భారతీయులకు అన్ని రకాల వీసాల మంజూరు సేవలను పునఃప్రారంభించింది. గత రెండు నెలలుగా పూర్తిగా నిలిచిపోయిన ఈ సేవలు ఇప్పుడు మళ్లీ అందుబాటులోకి వచ్చాయి.
బంగ్లాదేశ్ నూతన ప్రధానిగా తారిఖ్ రెహమాన్ బాధ్యతలు చేపట్టిన మూడు రోజుల్లోనే ఈ సానుకూల నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో వీసా సేవలు ప్రారంభమయ్యాయి. త్వరలో ఢాకాలోని భారత రాయబార కార్యాలయంలో కూడా బంగ్లాదేశ్ నుంచి భారత్ కు వీసాలు జారీ చేసే సేవలు మళ్లీ మొదలవుతాయని బంగ్లాలోని భారత రాయబార కార్యాలయం అధికారి అనిరుద్ధ దాస్ తెలిపారు. మెడికల్, టూరిజం సహా అన్ని రకాల వీసాలు అందుబాటులోకి రానున్నాయి. దీంతో, ఇరు దేశాల మధ్య సంబంధాలు మళ్లీ గాడిన పడే అవకాశం ఉంది.