Fridge explosion: ఫ్రిజ్ పేలిపోయింది... ఎవరూ లేకపోవడంతో తప్పిన ముప్పు!
- పశ్చిమ గోదావరి జిల్లా మొగుల్తూరులో ఘటన
- విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో పేలిపోయిన ఫ్రిజ్
- పేలుడు ధాటికి గదిలోని శ్లాబ్ పెచ్చులూడిపోయిన వైనం
పశ్చిమ గోదావరి జిల్లాలోని ఓ ఇంట్లోని విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఫ్రిజ్ పేలిపోవడం తీవ్ర కలకలాన్ని రేపింది. మొగుల్తూరు పంచాయతీ పరిధిలోని కొండావారిపాలెంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో ఆ గదిలో ఎవరూ లేకపోవడంతో పెను ముప్పు తప్పింది.
వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన బొడ్డుపల్లి రమేశ్ బాబు ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ శబ్దంతో ప్రిజ్ పేలిపోయింది. పేలుడు ధాటికి గదిలోని శ్లాబ్ పెచ్చులూడి పడ్డాయి. అదే గదిలోని టీవీ, టేబుల్ ఫ్యాన్ కాలిపోయాయి.
ఈ ఘటనతో దట్టంగా పొగలు కమ్ముకోవడంతో ఇంట్లోని వారంతా ఊపిరాడక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వారు పెద్ద పెట్టున కేకలు వేయడంతో స్థానికులు వెంటనే స్పందించి ఆ ప్రాంతానికి విద్యుత్ సరఫరా నిలిపివేయించారు. దీంతో పెనుప్రమాదం తప్పింది.