Highlight Builders: ఉద్యోగులకు రూ.20 కోట్లతో ఖరీదైన కార్లు బహుమతిగా ఇచ్చిన కంపెనీ

Highlight Builders gifts cars worth 20 crore to employees
షార్ట్స్‌లో చూడండి
కేరళకు చెందిన ఓ కంపెనీ 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సంస్థ అభివృద్ధిలో కీలకంగా వ్యవహరించిన ఉద్యోగులకు కోట్లాది రూపాయల బహుమతులు ఇచ్చింది. ఉద్యోగులకు రూ.20 కోట్ల విలువ చేసే 47 కార్లను అందించింది. హైలైట్ సంస్థ రిటైల్ స్పేస్ రంగంలో కేరళలో అగ్రగామిగా ఉంది. ఈ సంస్థను 1996లో స్థాపించారు.

ఇటీవలే ఈ కంపెనీ ముప్పై ఏళ్లు పూర్తి చేసుకోవడంతో కాలికట్‌లో ఘనంగా వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా కంపెనీకి చెందిన పలువురు ఉద్యోగులకు ఖరీదైన కార్లను అందజేశారు. వీటిలో రేంజ్ రోవర్, ఆడి క్యూ8, లాండ్ రోవర్ డిఫెండర్, టాటా హారియర్, కియా సెల్టోస్, హ్యుండాయ్ క్రెటా, స్కోడా కైలాక్ వంటి కార్లు ఉన్నాయి.

2030 నాటికి తమ సంస్థలను మరింత విస్తరించి 2 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని కంపెనీ యాజమాన్యం తెలిపింది. హైలైట్ సంస్థకు త్రిసూర్, కాలికట్‌లలో లగ్జరీ మాల్స్ ఉన్నాయి. కేరళ వ్యాప్తంగా 10 మాల్స్ అభివృద్ధి దశలో ఉండగా, 10 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
Go Back to Shorts
Highlight Builders
Kerala company
Employee gifts
Car gifts
Range Rover
Audi Q8
Tata Harrier

More Telugu News