Komatireddy Raj Gopal Reddy: పదవులపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

Komatireddy Raj Gopal Reddy Interesting Comments on Posts
  • పదవులు శాశ్వతం కాదన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
  • తనకు నియోజకవర్గ అభివృద్ధి ముఖ్యమన్న రాజగోపాల్ రెడ్డి
  • తనకు పదవులు ఇవ్వకపోయినా పర్వాలేదని వ్యాఖ్య
మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పదవులు శాశ్వతం కాదని, తన నియోజకవర్గం అభివృద్ధి తనకు ముఖ్యమని ఆయన అన్నారు. తనకు పదవులు ఇవ్వకపోయినా పర్వాలేదని మునుగోడు నియోజకవర్గం అభివృద్ధికి సహకరిస్తే చాలని అన్నారు. కాగా, రాజగోపాల్ రెడ్డి ఇటీవలి వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకున్న విషయం తెలిసిందే.

తనకు మంత్రి పదవి ఇవ్వాలని, ఆ హామీతోనే తాను పార్టీలోకి వచ్చానని ఆయన ఇటీవల వెల్లడించారు. తనకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని లేదంటే ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నిస్తానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మళ్లీ అడగబోనని, కానీ తనకూ ఒకరోజు వస్తుందని, ఆ రోజు లాక్కుంటానని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి ఒక్కరే కష్టపడితే కాంగ్రెస్ అధికారంలోకి రాలేదని, పార్టీలోని వారంతా శ్రమించారని అన్నారు. 

అయితే, మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
Komatireddy Raj Gopal Reddy
Munugodu
Telangana Congress
Revanth Reddy
Minister Post
Municipal Elections

More Telugu News