Rajiv Gandhi International Airport: హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు

Rajiv Gandhi International Airport Receives Bomb Threat
షార్ట్స్‌లో చూడండి
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు వచ్చింది. ఈ మేరకు మెయిల్ ద్వారా బెదిరింపు అందింది. ఆదివారం ఉదయం సింగపూర్-హైదరాబాద్ విమానంలో బాంబు పెట్టినట్లు మెయిల్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. శంషాబాద్ విమానాశ్రయంలో విమానం ల్యాండ్ కాగానే ప్రయాణికులను కిందకు దింపి, తనిఖీలు చేపట్టగా, బాంబు లభ్యం కాలేదు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

ఈ బెదిరింపు మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పంపించారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గత డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ఈ రెండు నెలల వ్యవధిలో శంషాబాద్ విమానాశ్రయానికి 23 నకిలీ బాంబు బెదిరింపు కాల్స్ వచ్చినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. కొన్ని ఫోన్ కాల్స్ విదేశాల నుంచి వచ్చినట్లు కూడా గుర్తించారు.
Go Back to Shorts
Rajiv Gandhi International Airport
Hyderabad Airport
Bomb threat
Shamshabad Airport
Singapore Hyderabad flight

More Telugu News