Hyderabad: మాదాపూర్‌లోని ఖానామెట్‌లో హైడ్రా కూల్చివేతలు.. ఉద్రిక్తత

Hyderabad Khana Met Demolition Drive Creates Tension
షార్ట్స్‌లో చూడండి
హైదరాబాద్‌లోని మాదాపూర్ ఖానామెట్‌లో ఉద్రిక్తత నెలకొంది. సర్వే నెంబర్ 55లో రోడ్డుపై ఉన్న దుకాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఇక్కడి అర్ధనారీశ్వర ఆలయం సమీపంలోని నిర్మాణాలను కూల్చివేస్తుండగా ఆలయ కమిటీ సభ్యులు, పుజారులు, స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత ఏర్పడింది.

ఈ నిర్మాణాలపై స్టేటస్ కో ఉందని అయినప్పటికీ హైడ్రా అధికారులు కూల్చివేశారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా దౌర్జన్యంగా కూల్చివేతలు చేపట్టారని ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని బాధితులు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

కాగా, అనుమతులు లేకుండా భవనాలు, షెడ్డు నిర్మించారని ఆరోపిస్తూ హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ప్రభుత్వ భూమిలో రోడ్డు పక్కన అనధికారికంగా దుకాణాలు ఏర్పాటు చేశారని, అవి అక్రమ నిర్మాణాలని హైడ్రా అధికారులు చెబుతున్నారు.
Go Back to Shorts
Hyderabad
Khana Met
Hydra
Demolition
Madhapur
Ardhanareshwara Temple
Illegal constructions

More Telugu News