Hyderabad: హైదరాబాద్ శివారులో భూప్రకంపనలు... బయటకు పరుగుతీసిన ప్రజలు

Hyderabad Suburbs Experience Earthquake Tremors People Flee Homes
షార్ట్స్‌లో చూడండి
హైదరాబాద్ శివారులో స్వల్పంగా భూప్రకంపనలు వచ్చాయి. కుత్బుల్లాపూర్ సర్కిల్ గాజులరామారంలోని మెట్‌ఖాన్‌గూడ ప్రాంతంలో ఉదయం 10:10 గంటలకు భూమి కంపించినట్లు శబ్దం వచ్చింది. దీంతో ఇళ్లలో ఉన్న ప్రజలు బయటకు పరుగు తీశారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా గేటెడ్ కమ్యూనిటీ, అపార్టుమెంట్లు ఉన్నాయి. ప్రకంపనలు రావడంతో వారు ఒక్కసారిగా భయపడి బయటకు వచ్చారు. అయితే ఇది భూమి కంపించడం వల్ల జరిగిందా? లేక చుట్టుపక్కల పేలుడుతో వచ్చిన ప్రకంపనలా అనేది తెలియాల్సి ఉంది. గేటెడ్ కమ్యూనిటీల్లోని సీసీ కెమెరాల్లో భూమి కంపించినట్లు కనిపించింది.

స్థానికంగా ఉన్న పాఠశాలకు స్కూల్ యాజమాన్యం సెలవు ప్రకటించింది. స్థానికులు మాట్లాడుతూ, భూమి హఠాత్తుగా కంపించినట్లయిందని, ఏం జరిగిందో తెలియక అందరం బయటకు వచ్చామని చెప్పారు. భారీ శబ్దం వచ్చి భూమి కంపించినట్లు అనిపించిందని అన్నారు. ఈ ఘటన నేపథ్యంలో రెవెన్యూ, సంబంధిత అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
Go Back to Shorts
Hyderabad
Hyderabad earthquake
Earthquake
Gazularamaram
Quthbullapur
Telangana
tremors

More Telugu News