Nalini Unagar: డ్రై క్లీనర్ నెల సంపాదన రూ.2 లక్షలు.. నెట్టింట వైరల్ అయిన పోస్ట్!
- సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ జీతంతో సమానమంటూ పోలిక
- ఉద్యోగం, వ్యాపారంపై నెట్టింట పెద్ద ఎత్తున చర్చ
- ఇద్దరు సహాయకులతో కలిసి భార్యాభర్తల వ్యాపారం
ఓ సాధారణ డ్రై క్లీనింగ్ షాప్ యజమాని నెల సంపాదన రూ.2 లక్షలకు పైనే అంటే నమ్ముతారా? నమ్మశక్యంగా లేకపోయినా ఇదే నిజమంటూ ఓ కంటెంట్ క్రియేటర్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు నెట్టింట ప్రకంపనలు సృష్టిస్తోంది. సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌తో సమానంగా ఆయన సంపాదిస్తున్నారని తెలియడంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
నళిని ఉనగర్ అనే కంటెంట్ క్రియేటర్ 'ఎక్స్' వేదికగా ఈ వివరాలను పంచుకున్నారు. "నిన్న మా ఇంటి దగ్గర ఉన్న డ్రై క్లీనింగ్ షాప్ యజమానితో మాట్లాడాను. ఆయన, ఆయన భార్య ఇద్దరూ కలిసి ఈ షాపును నడుపుతున్నారు. ఇద్దరు సహాయకులు కూడా ఉన్నారు. వారి నెల సంపాదన రూ.2,00,000 అని చెప్పగానే నేను షాకయ్యాను. ఇది 10 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ జీతంతో సమానం" అని ఆమె తన పోస్టులో పేర్కొన్నారు.
గత నెల లెక్కల ప్రకారం ఈ ఆదాయం వచ్చిందని, సగటున ప్రతి నెలా రూ.2 లక్షలకు పైగానే సంపాదిస్తారని ఆ యజమాని చెప్పినట్టు నళిని తెలిపారు. వారి వ్యాపార లెక్కలను కూడా ఆమె వివరించారు. రోజూ సుమారు 350 బట్టలను ఐరన్ చేయడం ద్వారా రూ.3,500, దాదాపు 20 సూట్లు, చీరల వంటివాటిని డ్రై క్లీన్ చేయడం ద్వారా రూ.7,000 వస్తుందని పేర్కొన్నారు. నెలలో మూడు రోజులు సెలవు తీసుకున్నా వారి ఆదాయం రూ.2.83 లక్షలు ఉంటుందని, ఇందులో ఇద్దరు సిబ్బంది జీతాలు రూ.40,000, కరెంట్ బిల్లు రూ.6,000 పోగా.. నికరంగా రూ.2.37 లక్షల లాభం వస్తుందని అంచనా వేశారు. సొంత షాపు కావడంతో అద్దె ఖర్చు లేకపోవడం వారికి కలిసొచ్చే అంశం.
ఈ పోస్ట్ వైరల్ కావడంతో ఉద్యోగం, సొంత వ్యాపారం మధ్య ఉన్న తేడాలపై నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కొందరు ఇది స్ఫూర్తిదాయకమని అంటుండగా, మరికొందరు ఈ లెక్కల వాస్తవికతపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.