Kishan Reddy: కేసీఆర్‌ను కాపాడుతున్నారన్న రేవంత్ రెడ్డి... తీవ్రంగా స్పందించిన కిషన్ రెడ్డి

Kishan Reddy Slams Revanth Reddy Over KCR Actions
షార్ట్స్‌లో చూడండి
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీశ్ రావులను ఎప్పుడు అరెస్టు చేస్తారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ప్రశ్నించడం తెలిసిందే. వారిని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కాపాడుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ ఆరోపణలపై కిషన్ రెడ్డి స్పందించారు. ముఖ్యమంత్రికి చేతకాక వారిపై చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. కానీ బాధ్యతారాహిత్యంతో తమపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

కేసీఆర్‌తో కలిసి ఉన్నామని చెప్పుకోవాలని వ్యాఖ్యానించారు. కిషన్ రెడ్డి వల్లనో, కేంద్ర ప్రభుత్వం వల్లనో చర్యలు తీసుకోవడం లేదని మాపై నిందలు వేయవద్దని అన్నారు.

నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కేసీఆర్‌పై చర్యలు తీసుకుంటానంటే రేవంత్ రెడ్డిని ఎవరు అడ్డుకున్నారో చెప్పాలని నిలదీశారు. రాష్ట్రంలో చర్యలు తీసుకోవాల్సింది ముఖ్యమంత్రి, ఇక్కడి ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. తన పేరు లేదా కేంద్రం పేరు చెప్పి రేవంత్ రెడ్డి ఎక్కువ రోజులు తప్పించుకోలేరని అన్నారు.

కేసీఆర్‌పై చర్యలు తీసుకోవాలని ఏ ఒక్కరోజైనా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని ప్రశ్నించారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీని అడ్డుకోవడం కోసం సోనియా గాంధీ కుటుంబం, కేసీఆర్ కుటుంబం ఒక్కటయ్యాయని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
Go Back to Shorts
Kishan Reddy
Revanth Reddy
KCR
BRS
Telangana Politics
Rahul Gandhi
BJP Telangana
Municipal Elections

More Telugu News