Jairam Ramesh: భారత్, అమెరికా ట్రేడ్ డీల్... జైరామ్ రమేశ్ వ్యంగ్యం

Jairam Ramesh Comments on India US Trade Deal
షార్ట్స్‌లో చూడండి
భారత్, అమెరికా ట్రేడ్ డీల్‌పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేశ్ వ్యంగ్యంగా స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. వాణిజ్య ఒప్పందంలో 'హౌడీ మోదీ' కంటే 'నమస్తే ట్రంప్' పైచేయి సాధించిందని పేర్కొన్నారు. వాణిజ్య ఒప్పందంలోని వివరాల ప్రస్తావన సరిగ్గా లేదని అన్నారు. ఈ ఒప్పందం విషయంలో సంయుక్త ప్రకటనలో వివరాలు సరిగ్గా ప్రస్తావించలేదని విమర్శించారు.

అయితే భారత్ రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోదని మాత్రం అర్థమైందని అన్నారు. ఒకవేళ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తే మన వస్తువులపై 25 శాతం అదనపు సుంకాలు విధిస్తామని అమెరికా ప్రకటించిందని అన్నారు. దేశంలోని రైతుల ప్రయోజనాలను దెబ్బతీసి మరీ అమెరికా రైతులకు సహాయం చేకూరేలా దిగుమతులపై మన ప్రభుత్వం సుంకాలు తగ్గించనుందని విమర్శించారు.

అమెరికా దిగుమతులు మూడు రెట్లు ఎక్కువగా ఉండటంతో మన వాణిజ్యం తుడిచిపెట్టుకుపోతుందని అన్నారు. మనకు చెందిన ఐటీ, ఇతర సేవల ఎగుమతులపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోందని అన్నారు. ఈ క్రమంలో మన ఎగుమతుల్లోని కొన్ని వస్తువులు గతంలో కంటే ఎక్కువ సుంకాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై భారత్, అమెరికా ఈరోజు సంయుక్త ప్రకటన చేశాయి.
Go Back to Shorts
Jairam Ramesh
India US trade deal
India America trade
Congress
Howdy Modi
Namaste Trump

More Telugu News