ఇస్లామాబాద్‌లో ఎమర్జెన్సీ... 36కి చేరిన ఆత్మాహుతి దాడి మృతుల సంఖ్య
- పెద్ద సంఖ్యలో ప్రజలకు గాయాలు
- నగరంలో ఎమర్జెన్సీని ప్రకటించినట్లు పోలీసు అధికారి వెల్లడి
- గాయపడిన వారిని ఆసుపత్రికి తరలింపు
పేలుడు అనంతరం నగరంలో నగరవ్యాప్తంగా ఎమర్జెన్సీని ప్రకటించినట్లు ఇస్లామాబాద్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వెల్లడించారు. ముఖ్యమైన ప్రదేశాల్లో భద్రతా సిబ్బంది విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. ఈ దుర్ఘటనలో గాయపడిన వారిని పాకిస్థాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సెస్, పాలీక్లినిక్ ఆసుపత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఇస్లామాబాద్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఖండించారు. ఈ ఘటన అత్యంత బాధాకరమని, పలువురు మృతి చెందారని అన్నారు. ఆత్మాహుతి దాడిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు.