Dr Sanjay Kumar: పార్టీ ఫిరాయింపుల కేసులో కీలక పరిణామం

Jagtial MLA Sanjay Kumar Petition Dismissed by Speaker
షార్ట్స్‌లో చూడండి
ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో ఈరోజు కీలక పరిణామం చోటుచేసుకుంది. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కు భారీ ఊరట లభించింది. ఆయనపై బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను స్పీకర్ గడ్డం ప్రసాద్ కొట్టేశారు. సంజయ పార్టీ మారారనేందుకు సరైన ఆధారాలు లేవని స్పీకర్ పేర్కొన్నారు. ఈ తీర్పుతో ఇప్పటి వరకు 8 మంది ఎమ్మెల్యేలకు ఊరట లభించింది.

గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నుంచి పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారని, అధికార కాంగ్రెస్ లో చేరారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఆ పదిమంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పట్టుబడుతోంది. దీనిపై గతంలోనే స్పీకర్ కు ఫిర్యాదు చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన స్పీకర్.. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. తాజాగా సంజయ్ కు క్లీన్ చిట్ ఇచ్చారు.

Go Back to Shorts
Dr Sanjay Kumar
Jagtial MLA
BRS
Congress
Party Defection
Telangana Politics
Gaddam Prasad
Jagadish Reddy
Telangana Assembly

More Telugu News