Team India: పాక్ ఆడకున్నా సరే శ్రీలంక వెళ్లనున్న టీమిండియా.. ఎందుకలా..!

Team India Sri Lanka Trip Amidst Pakistan Uncertainty
షార్ట్స్‌లో చూడండి
టీ20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ జట్టు కారణంగా నెలకొన్న సందిగ్ధత ఇంకా కొనసాగుతూనే ఉంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 15న టీమిండియా, పాక్ జట్ల మధ్య శ్రీలంకలో మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే, భారత జట్టుతో ఆడబోమని పాకిస్థాన్ స్పష్టం చేసింది. పాక్ జట్టు టోర్నమెంట్ లో పాల్గొంటుందనీ, అయితే భారత్ తో మ్యాచ్ ను మాత్రం బహిష్కరిస్తున్నామని తెలిపింది. దీనిపై ఐసీసీ తాజాగా పాకిస్థాన్ బోర్డుకు వార్నింగ్ ఇచ్చింది.

ఈ సందిగ్దం ఇలా కొనసాగుతుండగా.. ఈ నెల 15న టీమిండియా మాత్రం శ్రీలంకకు వెళ్లనుంది. ఓవైపు తాము ఆడబోమని పాక్ చెబుతుండగా భారత జట్టు మాత్రం శ్రీలంకకు వెళ్లడం ఎందుకనే సందేహాలకు నిపుణులు జవాబిచ్చారు. ఐసీసీ ప్రొటోకాల్ మేరకే టీమిండియా కొలంబో వెళ్లనుందని, షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన మ్యాచ్ కు అందుబాటులో ఉంటుందని చెబుతున్నారు.

మ్యాచ్ కు ముందు యథావిధిగా ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్ లోనూ పాల్గొంటారని తెలుస్తోంది. మ్యాచ్ సమయంలో స్టేడియంను సందర్శిస్తుంది. పాకిస్తాన్ జట్టు మైదానంలోకి రాకపోతే, మ్యాచ్ రిఫరీ మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటిస్తాడు. భారత జట్టు ఈ మొత్తం ప్రక్రియ కోసం వేచి ఉండి, వాక్ ఓవర్ పొందిన తర్వాత తిరిగి భారతదేశానికి తిరిగి వస్తుంది.
Go Back to Shorts
Team India
India vs Pakistan
T20 World Cup
Sri Lanka
ICC
Pakistan Cricket Board
Match boycott
Colombo
Cricket

More Telugu News