Mudragada Padmanabha Reddy: కాపు కులాన్ని కట్టుబట్టలతో వేరే రాష్ట్రానికి పంపించే కార్యక్రమం చేయండి: చంద్రబాబుకు ముద్రగడ పద్మనాభరెడ్డి లేఖ

Mudragada Padmanabha Reddy Letter to Chandrababu
షార్ట్స్‌లో చూడండి
గాడి తప్పిన రాక్షస పాలనతో దహనకాండ చూస్తున్నామని కాపు ఉద్యమ నేత, వైసీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లకు లేఖ రాశారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేశ్ లను ఘోరంగా అవమానించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. తిరుపతి లడ్డూలో నెయ్యిలో కల్తీ జరగలేదని సీబీఐ నివేదిక ఇవ్వడంతో... మీరు చెప్పిన అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి మీరు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావని అన్నారు. 

కాపు కులం మీ మీద ఎంతో కోపంగా ఉన్నా... పవన్ కల్యాణ్ పై ప్రేమతో మీకు మద్దతు ఇవ్వడం జరిగిందనేది తన అభిప్రాయమని ముద్రగడ పేర్కొన్నారు. దయచేసి కాపు కులాన్ని ఈ రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి కట్టుబట్టలతో పంపించే కార్యక్రమం చేయండని అన్నారు.




Go Back to Shorts
Mudragada Padmanabha Reddy
Chandrababu Naidu
Andhra Pradesh
Kapu caste
Nara Lokesh
Ambati Rambabu
Jogi Ramesh
Tirupati laddu
AP Politics

More Telugu News