టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ... రవిచంద్రకు బాధ్యతలు
- టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌పై బదిలీ వేటు
- సీఎం ముఖ్య కార్యదర్శి రవిచంద్రకు అదనపు బాధ్యతలు
- నేడు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
1993 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన అనిల్ కుమార్ సింఘాల్, 2017 మే నుంచి 2020 అక్టోబర్ వరకు తొలిసారి టీటీడీ ఈవోగా సేవలందించారు. అనంతరం గతేడాది సెప్టెంబరులో రెండోసారి ఈ పదవిని చేపట్టారు. కేవలం ఐదు నెలల కాలంలోనే ఆయన బదిలీ కావడం టీటీడీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
కాగా, తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకంపై సిట్ నివేదిక వచ్చిన కొన్ని రోజుల్లోనే ఈ బదిలీ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.