Rohit Shetty: బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టి ఇంటి వద్ద కాల్పులు.. ముంబైలో హై అలర్ట్!
- జుహులోని నివాసం వద్ద గాల్లోకి నాలుగు రౌండ్ల కాల్పులు
- తెల్లవారుజామున బైక్‌పై వచ్చి దుండగుల వీరంగం
- దర్శకుడి ఇంటి వద్ద భారీగా మోహరించిన పోలీసులు
- రంగంలోకి క్రైమ్ బ్రాంచ్, ఫోరెన్సిక్ బృందాలు
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి నివాసం వద్ద ఆదివారం తెల్లవారుజామున కాల్పులు జరగడం చిత్ర పరిశ్రమలో తీవ్ర సంచలనం సృష్టించింది. ముంబైలోని జుహు ప్రాంతంలో ఉన్న ఆయన నివాసం వెలుపల గుర్తు తెలియని దుండగులు నాలుగు రౌండ్ల పాటు కాల్పులు జరిపి పరారయ్యారు. ఈ ఘటన జరిగిన సమయంలో రోహిత్ శెట్టి ఇంట్లోనే ఉన్నారా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని పోలీసులు ధ్రువీకరించారు.
ఘటన గురించి సమాచారం అందిన వెంటనే జుహు పోలీసులు, ముంబై క్రైమ్ బ్రాంచ్ బృందాలు అక్కడికి చేరుకున్నాయి. ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలం నుంచి ఆధారాలను సేకరిస్తున్నారు. దుండగులు ఎక్కడి నుంచి వచ్చారు? ఏ దిశగా వెళ్లారు? అనే విషయాలను తెలుసుకోవడానికి పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం రోహిత్ శెట్టి నివాసం వద్ద భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.
గతంలోనూ సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరోల ఇళ్ల వద్ద కాల్పులు జరిగిన ఘటనలు మరవకముందే, ఇప్పుడు రోహిత్ శెట్టి ఇల్లు టార్గెట్ కావడం చర్చనీయాంశమైంది. 'సింగం', 'గోల్‌మాల్' వంటి బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన రోహిత్ శెట్టిపై ఎందుకు కాల్పులు జరిపారు? దీని వెనుక ఏవైనా అండర్ వరల్డ్ గ్యాంగ్‌ల హస్తం ఉందా? లేదా బెదిరింపుల కోణంలో ఇలా చేశారా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ కాల్పుల ఘటనపై రోహిత్ శెట్టి కుటుంబం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. నిందితులను పట్టుకోవడానికి పోలీసులు ముంబై వ్యాప్తంగా గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.