భారత్-ఈయూ వాణిజ్య ఒప్పందంపై అమెరికా స్పందన
- శుద్ధిచేసిన చమురును భారత నుంచి యూరోపియన్ దేశాలు కొనుగోలు చేస్తూ తమపై జరుగుతున్న యుద్ధానికి తామే నిధులు సమకూర్చుకుంటున్నాయన్న బెసెంట్
- ఉక్రెయిన్ - రష్యా యుద్ధానికి డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలో ముగింపు పలుకుతామని వెల్లడి
- భారత్‌పై అమెరికా విధించిన టారిఫ్‌లు సగానికి తగ్గే అవకాశం ఉందన్న బెసెంట్
ఉక్రెయిన్ - రష్యా యుద్ధానికి డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలో ముగింపు పలుకుతామని బెసెంట్ ధీమా వ్యక్తం చేశారు. ఈ యుద్ధానికి పరిష్కారం చూపేందుకు ట్రంప్ తీవ్రంగా కృషి చేస్తున్నారని, ఈ విషయంలో ఐరోపా దేశాల కంటే అమెరికానే భారీ త్యాగాలు చేసిందని చెప్పుకొచ్చారు. అయితే ఆ త్యాగాల వివరాలను ఆయన వెల్లడించలేదు.
భారత్‌పై అమెరికా విధించిన టారిఫ్‌లు సగానికి తగ్గే అవకాశం ఉందన్న సంకేతాలను బీసెంట్ ఇటీవల ఇచ్చిన విషయం తెలిసిందే. రష్యా చమురు కొనుగోళ్లను భారత్ తగ్గించుకుందని చెబుతూ, దానిని తమ పెద్ద విజయంగా పేర్కొన్నారు. చమురు విషయంలో టారిఫ్‌లు ఇంకా అమల్లో ఉన్నాయని, వాటిని తొలగించే మార్గం ఉందని భావిస్తున్నానని ఆయన పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు.