నా భుజంపై చేయి వేసి రాహుల్ గాంధీ గెలిపించమంటే ప్రజలు నన్ను ఓడించారు: జగ్గారెడ్డి
- జీవితంలో తాను సంగారెడ్డిలో ఎమ్మెల్యేగా పోటీ చేయనన్న జగ్గారెడ్డి
- రాహుల్ గాంధీని ఇక్కడకు పిలిచి అవమానించినట్లుగా భావిస్తున్నానని వ్యాఖ్య
- తన జీవితంలో ఇది మరిచిపోలేని విషయమన్న జగ్గారెడ్డి
ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ, రాహుల్ గాంధీని ఇక్కడకు పిలిచి తాను అవమానించినట్లుగా భావిస్తున్నానని పేర్కొన్నారు. తన కోసం రాహుల్ గాంధీ సంగారెడ్డికి వచ్చి గెలిపించాలని ప్రచారం చేశారని, కానీ ఫలితం మాత్రం తనకు అనుకూలంగా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తన జీవితంలో ఇది మరిచిపోలేని విషయమని ఆయన అన్నారు. తన ఓటమికి ఇక్కడి పేద ప్రజలు కాదని, మేధావులు, పెద్దలని విమర్శించారు. సంగారెడ్డిలో ఈసారి తన భార్య నిర్మల పోటీ చేసినా తాను ప్రచారానికి కూడా రానని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్లి ప్రచారం చేస్తానని, సంగారెడ్డిలో మాత్రం చేయబోనని అన్నారు.