రూ.1 లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన రంగారెడ్డి జిల్లా అధికారులు
- ఏసీబీకి చిక్కిన నందిగామ ఎంపీడీవో, ఏపీవో, ఈదులపల్లి కార్యదర్శి
- ఇంటి నిర్మాణానికి సంబంధించి రూ.3.5 లక్షలు డిమాండ్ చేసిన అధికారులు
- రెండోసారి రూ.1 లక్ష చెల్లిస్తుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు
బాధితుడు ప్రవీణ్ గతంలో రూ.1 లక్ష చెల్లించాడు. మిగిలిన సొమ్ము కోసం అధికారులు తన నుంచి లంచం డిమాండ్ చేస్తున్నారని అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో ఈరోజు ఎంపీడీవో కార్యాలయంలో మరో రూ.1 లక్ష లంచం ఇస్తుండగా ముగ్గురినీ ఏసీబీ డీఎస్పీ పట్టుకున్నారు. ఈ ఘటనపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.