Dhandoraa Movie: కుల వ్యవస్థపై 'దండోరా'.. ఆలోచింపజేస్తున్న ట్రైలర్

Dhandoraa Movie Trailer Released Gripping Caste System Story
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ గ్రామీణ నేపథ్యంలోని సామాజిక అంశాలను స్పృశిస్తూ తెరకెక్కిన చిత్రం 'దండోరా'. ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి చిత్రం యూనిట్ తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సినిమాపై అంచనాలను పెంచుతోంది.

"మన చావు పుట్టుకలన్నీ ఈ ఊరి బయట రాసిండ్రా ఆ దేవుడు.." అనే డైలాగ్‌తో ప్రారంభమయ్యే ఈ ట్రైలర్, గ్రామాల్లో ఇంకా కొనసాగుతున్న కుల వివక్షను కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. ఊరి బయట శవాన్ని మోసుకెళ్తున్న దృశ్యాలు కథలోని తీవ్రతను, సామాజిక కోణాన్ని తెలియజేస్తున్నాయి. మురళీకాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మించారు.

శివాజీ, నవదీప్‌, నందు, రవికృష్ణ, బిందుమాధవి, మౌనికా రెడ్డి వంటి భారీ తారాగణం ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నైజాం ఏరియాలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తుండటం విశేషం. విదేశాల్లో కూడా సుమారు 200కు పైగా థియేటర్లలో ఈ సినిమాను ప్రదర్శించనుండగా, ఈ నెల‌ 23నే అక్కడ ప్రీమియర్ షోలు వేయనున్నారు.

మార్క్ కె. రాబిన్ అందించిన సంగీతం సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తుందని, తెలంగాణ మట్టి కథలను ఇష్టపడే ప్రేక్షకులను ఈ సినిమా తప్పకుండా ఆకట్టుకుంటుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.

Go Back to Shorts
Dhandoraa Movie
Dandora
Telugu Movie
Kolleru Ravindra
Muralikanth
Caste System
Social Issues
Telangana
Maitri Movie Makers
Telugu Cinema

More Telugu News