మోదీకి ఆ రెండు అంశాలు అసలే గిట్టవు: రాహుల్ గాంధీ
- గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై రాహుల్ గాంధీ ఆగ్రహం
- రాహుల్ గాంధీ ఆలోచనలు, పేదల హక్కులు మోదీకి నచ్చవని వ్యాఖ్య
- ఈ పథకాన్ని బలహీనపరచాలని పదేళ్లుగా చూస్తున్నారని ఆరోపణ
ఈ పథకం పేరు మార్పు బిల్లు మహాత్మా గాంధీ ఆలోచనలకు అవమానమని ఆయన అభివర్ణించారు. 2014 నుంచి ఈ పథకాన్ని బలహీనపరిచేందుకు కుట్రలు జరుగుతున్నాయని మోదీపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు ఈ ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ వస్తోందని పేర్కొన్నారు. ఇప్పుడు ఏకంగా ఆ పథకాన్ని పూర్తిగా తుడిచిపెట్టాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు.