కాలిఫోర్నియాలో కాల్పులు.. నలుగురు మృతి, 10 మందికి గాయాలు
దుండగుల కాల్పుల్లో గాయపడిన వారిలో పలువురు చిన్నారులు కూడా ఉన్నట్లు తెలిపింది. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నామని, బాధితులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. కాల్పులు జరిపిన దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు వెల్లడించారు. అయితే, ఈ కాల్పులకు కారణమేంటనేది తెలియరాలేదని వివరించారు. మృతులను గుర్తించాల్సి ఉందని చెప్పారు.