రాజమౌళి తనయుడితో ప్రియాంక చోప్రా స్టెప్పులు... వీడియో ఇదిగో!
- రాజమౌళి తనయుడు కార్తికేయతో డ్యాన్స్ చేసిన ప్రియాంక చోప్రా
- మహేశ్ బాబు నటిస్తున్న వారణాసి సినిమాకు కార్తికేయ సహ నిర్మాత
- 'ఊర్వశీ ఊర్వశీ' పాటకు ఇద్దరూ కలిసి స్టెప్పులు
- పుట్టినరోజు సందర్భంగా కార్తికేయకు శుభాకాంక్షలు తెలిపిన ప్రియాంక
- సంబంధిత వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన గ్లోబల్ స్టార్
తాజాగా కార్తికేయ పుట్టినరోజు సందర్భంగా ప్రియాంక ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఇద్దరూ కలిసి ‘ఊర్వశీ ఊర్వశీ టేకిట్ ఈజీ ఊర్వశీ’ పాట ఇన్స్‌ట్రుమెంటల్ మ్యూజిక్‌కు సరదాగా కాలు కదిపారు. ఈ వీడియోను తన ఎక్స్ ఖాతాలో పంచుకున్న ప్రియాంక, కార్తికేయకు ప్రత్యేకంగా బర్త్ డే విషెస్ తెలియజేశారు.
"టేక్ ఇట్ ఈజీ మై ఫ్రెండ్! తెరవెనుక ఉండి అన్ని పనులూ సైలెంట్‌గా చక్కబెట్టే నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు కార్తికేయ. ఈ సినిమా ప్రయాణంలో నీతో కలిసి డ్యాన్స్ చేయడం చాలా సంతోషంగా ఉంది" అని ప్రియాంక తన పోస్టులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.