బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం.. సిట్ విచారణకు హాజరైన విజయ్ దేవరకొండ
- నిషేధిత బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేసిన వ్యవహారంలో నోటీసులు
- పారితోషికం, కమీషన్లపై సిట్ అధికారుల ఆరా
- విజయ్‌తో పాటు ప్రకాశ్ రాజ్‌కు నోటీసులు
బెట్టింగ్ యాప్‌ల నుంచి తీసుకున్న పారితోషికం, కమీషన్లపై సిట్ అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. విచారణకు హాజరు కావాలని విజయ్ దేవరకొండతో పాటు నటుడు ప్రకాశ్ రాజ్‌కు కూడా సీఐడీ సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. బెట్టింగ్ యాప్‌లకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదయ్యాయి.