ఓటీటీ తెరపైకి కన్నడ హారర్ థ్రిల్లర్!
- కన్నడ హారర్ థ్రిల్లర్ గా 'కమరో 2'
- ఆగస్టులో థియేటర్స్ లో దిగిన సినిమా
- ఈ నెల 7వ తేదీ నుంచి 'సన్ నెక్స్ట్'లో
- కన్నడలో మాత్రమే అందుబాటులోకి
2019లో కన్నడలో రూపొందిన 'కమరొట్టు చెక్ పోస్ట్' సినిమాకి అనూహ్యమైన రెస్సాన్స్ వచ్చింది. ఆ సినిమాకి సీక్వెల్ గా నిర్మితమైనదే 'కమరో 2'. పవన్ గౌడ నిర్మించిన ఈ సినిమాకి పరమేశ్ దర్శకత్వం వహించాడు. రవిశ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, ప్రియాంక ఉపేంద్ర .. స్వామినాథన్ .. రజనీ భరద్వాజ్ .. నాగేంద్ర .. రాఘవేంద్ర రాజ్ కుమార్ ముఖ్యమైన పాత్రలను పోషించారు.
దెయ్యాలపై ఎవరి నమ్మకాలు వారికి ఉంటాయి. లేవని కొట్టిపారేసేవారు కొందరైతే, ఉన్నాయో లేదో చూద్దామని రంగంలోకి దిగేవారు మరికొందరు. ఆ రెండో రకానికి చెందిన ఒక యువతి, అదృశ్యమైన తన సోదరిని వెతుక్కుంటూ 'కమరొట్టు హౌస్'కి వస్తుంది. అక్కడ ఆమెకి ఒక నిజం తెలుస్తుంది. అదేమిటి? అక్కడి నుంచి బయటపడటానికి ఆమె చేసిన ప్రయత్నం ఫలిస్తుందా? అనేది మిగతా కథ.