Jeevan Gowda: బెంగళూరు కాలేజీలో దారుణం.. వాష్‌రూమ్‌లో విద్యార్థినిపై అత్యాచారం
- ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో దారుణ ఘటన
- క్యాంపస్‌లోని మగవారి వాష్‌రూమ్‌లో విద్యార్థినిపై అత్యాచారం
- సహ విద్యార్థి జీవన్ గౌడపై బాధితురాలి ఫిర్యాదు
- నిందితుడిని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించిన పోలీసులు
- భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 64 కింద కేసు నమోదు
- ఐదు రోజుల తర్వాత వెలుగులోకి వచ్చిన ఘటన
దక్షిణ బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న విద్యార్థినిపై, ఆమె సహచర విద్యార్థి అత్యాచారానికి పాల్పడ్డాడు. క్యాంపస్‌లోని ఆరవ అంతస్తులో ఉన్న మగవారి వాష్‌రూమ్‌లో ఈ అఘాయిత్యం జరిగినట్లు బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి నిందితుడు జీవన్ గౌడ (21)ను పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఘటన ఈ నెల10న జరగ్గా, బాధితురాలు ఐదు రోజుల తర్వాత 15న ధైర్యం చేసి ఫిర్యాదు చేసింది. నిందితుడు జీవన్ గౌడ, బాధితురాలు గతంలో క్లాస్మేట్స్ అని, అయితే బ్యాక్లాగ్ కారణంగా నిందితుడు చదువులో వెనుకబడ్డాడని ప్రాథమిక సమాచారం. ఘటన జరిగిన రోజు లంచ్ బ్రేక్ సమయంలో జీవన్ గౌడ బాధితురాలికి పదేపదే ఫోన్ చేసి కలవాలని కోరాడు. ఆమె అక్కడికి రాగానే, అతడు బలవంతంగా ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించాడు.
అతడి నుంచి తప్పించుకునేందుకు బాధితురాలు లిఫ్ట్ వైపు వెళ్లగా, నిందితుడు ఆమెను ఆరవ అంతస్తు వరకు వెంబడించాడు. అక్కడ ఆమెను బలవంతంగా మగవారి వాష్‌రూమ్‌లోకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఈ దారుణం తర్వాత బాధితురాలు తన ఇద్దరు స్నేహితులకు విషయం చెప్పింది. అనంతరం నిందితుడు బాధితురాలికి ఫోన్ చేసి, ‘పిల్ ఏమైనా కావాలా?’ అని అడిగినట్లు కూడా ఫిర్యాదులో ప్రస్తావించారు.
మొదట ఈ విషయం చెప్పడానికి సంకోచించినా, ఆ తర్వాత బాధితురాలు తన తల్లిదండ్రులకు చెప్పింది. వారి సహకారంతో హనుమంతనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడు జీవన్ గౌడను బుధవారం అదుపులోకి తీసుకుని, కోర్టు ఆదేశాల మేరకు జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఈ ఘటనపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 64 (అత్యాచారానికి శిక్ష) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.