అకస్మాత్తుగా నిమజ్జనం వేడుకలో ప్రత్యక్షమైన రేవంత్ రెడ్డి.. "గణపతి బప్పా మోరియా" అంటూ నినాదాలు
- పరిమిత వాహనాలతో సాదాసీదాగా వచ్చిన రేవంత్ రెడ్డి
- ట్రాఫిక్ క్లియరెన్స్ లేకుండా సామాన్యుడిలా నిమజ్జన ప్రక్రియ పరిశీలన
- "భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి" వేదిక నుంచి భక్తులకు అభివాదం
"గణపతి బప్పా మోరియా" అంటూ భక్తులతో కలిసి నినాదాలు చేశారు. క్రేన్ నెంబర్ 4 వద్ద నిమజ్జనాలను పరిశీలించారు. నిమజ్జనం ఏర్పాట్లను గురించి కలెక్టర్ హరిచందన ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా విధుల్లో పాల్గొన్న అన్ని విభాగాల సిబ్బందిని ముఖ్యమంత్రి అభినందించారు. నిమజ్జనాలు పూర్తయ్యే వరకు ఇదే స్ఫూర్తితో పని చేయాలని వారికి సూచించారు.