జియో, ఎయిర్ టెల్ లకు షాక్... చవక ప్లాన్ తీసుకొచ్చిన బీఎస్ఎన్ఎల్
- రూ. 147 రీఛార్జ్‌తో నెల రోజుల ప్లాన్
- 30 రోజుల పాటు అపరిమిత వాయిస్ కాల్స్
- 10 జీబీ డేటా వినియోగించుకునే అవకాశం
ఈ ప్లాన్ వివరాల్లోకి వెళ్తే, రూ. 147 తో రీఛార్జ్ చేసుకున్న కస్టమర్లకు 30 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ నెల రోజుల పాటు దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమితంగా వాయిస్ కాల్స్ చేసుకునే సౌకర్యం ఉంటుంది. దీంతో పాటు 10 జీబీ హై-స్పీడ్ డేటాను కూడా అందిస్తున్నారు. రోజుకు సుమారు ఐదు రూపాయల ఖర్చుతో వినియోగదారులు ఈ ప్రయోజనాలను పొందవచ్చు.
అయితే, ఈ ప్లాన్‌లో ఒక పరిమితి ఉంది. కేటాయించిన 10 జీబీ డేటా వినియోగం పూర్తయిన తర్వాత ఇంటర్నెట్ వేగం 40 కేబీపీఎస్‌కు తగ్గిపోతుంది. అందువల్ల, అధికంగా ఇంటర్నెట్ వాడే వారికి ఈ ప్లాన్ అంతగా సరిపోకపోవచ్చు. కానీ, ప్రధానంగా వాయిస్ కాల్స్ ఎక్కువగా మాట్లాడుతూ, పరిమితంగా డేటా వాడే వారికి ఇది ఒక అద్భుతమైన ఆప్షన్‌గా నిలుస్తుంది. పెరుగుతున్న రీఛార్జ్ ధరల నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన ఈ ప్లాన్ బడ్జెట్ వినియోగదారులను ఆకట్టుకుంటోంది.