ఓటీటీలో ఉత్కంఠను రేకెత్తించే తమిళ థ్రిల్లర్!
- తమిళంలో రూపొందిన సినిమా
- రివేంజ్ థ్రిల్లర్ జోనర్లో నడిచే కథ
- ఆహా తమిళ్ లో స్ట్రీమింగ్
- ఈ నెల 22వ నుంచి అందుబాటులోకి
శివ ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, జూన్ 5వ తేదీన థియేటర్లకు వచ్చింది. విజిత్ బచన్ .. షాలీ నివేకస్ .. అరుళ్ దాస్ .. మైమ్ గోపీ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ నెల 22వ తేదీ నుంచి 'ఆహా తమిళ్'లో స్ట్రీమింగ్ కానుంది.
ఒక యువకుడు - యువతి ప్రేమించుకుంటారు. అయితే వారి ప్రేమకు కులం అడ్డుగోడగా నిలుస్తుంది. వాళ్లిద్దరినీ విడదీయడానికి ఒక ముగ్గురు వ్యక్తులు ప్రయత్నిస్తారు. దాంతో ఆ ముగ్గురు వ్యక్తులపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఆ యువతి ఏం చేసింది? పర్యవసానంగా ఏం జరిగింది? అనేది కథ. ఓటీటీ వైపు నుంచి ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశమైతే ఉంది.