మోసం చేశాడంటూ నిర్మాతను చెప్పుతో కొట్టిన నటి.. వీడియో ఇదిగో!
- ముంబైలో మూవీ స్క్రీనింగ్ టైంలో ఘటన
- మీడియా సమక్షంలోనే దాడి చేసిన సీరియల్ నటి రుచి గుజ్జర్
- నిర్మాత కరణ్ సింగ్ చౌహాన్ పై మోసం, నమ్మకద్రోహం కేసు
రుచి గుజ్జర్ తెలిపిన వివరాల ప్రకారం.. కరణ్ సింగ్ చౌహాన్ ఓ టీవీ సీరియల్ నిర్మిద్దామని ప్రతిపాదించగా తాను రూ.24 లక్షలు ఇచ్చానని చెప్పింది. అయితే, రోజులు గడుస్తున్నా ఈ ప్రాజెక్టు పట్టాలెక్కకపోవడంతో తాను కరణ్ ను నిలదీయగా.. సాకులు చెప్పి తప్పించుకున్నాడని ఆరోపించింది. దీంతో తన డబ్బు తిరిగివ్వాలని కోరగా బెదిరింపులకు దిగాడని రుచి తెలిపింది.
ఈ క్రమంలోనే ‘సో లాంగ్ వ్యాలీ' మూవీ స్క్రీనింగ్ సమయంలో నిరసన తెలిపేందుకు వచ్చినట్లు రుచి గుజ్జర్ వివరించింది. ఈ వివాదం నేపథ్యంలో పోలీసులు కల్పించుకుని రుచి గుజ్జర్ ను అక్కడి నుంచి తీసుకెళ్లారు. కరణ్ సింగ్ పై నమోదైన కేసును దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.