చంటి పాపను వెంటబెట్టుకుని ప్రీమియర్ షోకు వెళ్లిన తల్లి.. వెనక్కి పంపిన పోలీసులు.. వీడియో ఇదిగో!
- ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ లో హరిహర వీరమల్లు ప్రీమియర్ షో
- పసిబిడ్డతో కలిసి వచ్చిన తల్లి.. తిప్పిపంపిన నిర్వాహకులు
- పుష్ప –2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా ఇదే థియేటర్ లో తొక్కిసలాట
తొక్కిసలాటలో ఓ మహిళ ప్రాణం కోల్పోగా ఆమె కొడుకు కోమాలోకి వెళ్లాడు. సుదీర్ఘ చికిత్స తర్వాత ఇటీవలే ఆ బాలుడు డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లినప్పటికీ ఇంకా పూర్తిస్థాయిలో కోలుకోలేదని సమాచారం. ఈ నేపథ్యంలో హరిహర వీరమల్లు ప్రీమియర్ షోకు పసిబిడ్డతో వచ్చిన తల్లిని పోలీసులు వెనక్కి పంపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆ మహిళపై తీవ్రంగా మండిపడుతున్నారు. చిన్న పిల్లను తీసుకుని బెనిఫిట్ షోకు రావడం ఏంటని విమర్శిస్తున్నారు.