సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న 'హరిహర వీరమల్లు'... ఈ నెల 20న వైజాగ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్
- పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో హరిహర వీరమల్లు
- పీరియాడిక్ యాక్షన్ జానర్ లో చిత్రం
- ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్
ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా చిత్రానికి క్రిష్ జాగర్లమూడి కొంత భాగం దర్శకత్వం వహించగా, మిగతా పార్ట్ ను ఏఎం జ్యోతికృష్ణ పూర్తిచేశారు. ఏఎం రత్నం నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా, చారిత్రక నేపథ్యంలో యుద్ధ సన్నివేశాలు, భావోద్వేగ క్షణాలతో ఆకట్టుకునేలా ఉంటుందని చిత్ర బృందం తెలిపింది. హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ నిక్ పావెల్ ఆధ్వర్యంలో భారీ యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించారు.
ఈ చిత్రంలో పవన్ కల్యాణ్‌తో పాటు నిధి అగర్వాల్, బాబీ డియోల్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఒక పవర్ ఫుల్ సాంగ్ తో పాటు చిత్ర నిర్మాణ వీడియోను విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమం అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపేలా ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రం, కన్నులపండుగలా ఉంటుందని అంచనా. మూడేళ్ల తర్వాత పవన్ కల్యాణ్ సిల్వర్ స్క్రీన్‌పై కనిపించనుండటంతో అభిమానులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.