ట్యూషన్‌కు వెళ్లమనడమే పాపమైంది.. భవనం పైనుంచి దూకి బాలుడి ఆత్మహత్య!
- ముంబైలో తీవ్ర విషాదం.. తల్లి మందలించడంతో విద్యార్థి బలవన్మరణం
- ట్యూషన్‌కు వెళ్లమని తల్లి ఒత్తిడి చేయడమే కారణంగా వెల్లడి
- కండివాలి ప్రాంతంలోని భవనంపై నుంచి దూకిన బాలుడు
- రక్తపు మడుగులో కొడుకును చూసి కుప్పకూలిన తల్లి
కొడుకు ట్యూషన్‌కు వెళ్లాడని తల్లి భావించింది. కానీ, కొద్ది నిమిషాలకే వారి అపార్ట్‌మెంట్ వాచ్‌మన్ పరుగున వచ్చి, పంత్ భవనం పైనుంచి పడిపోయాడని చెప్పాడు. ఈ వార్త విన్న తల్లి వెంటనే కిందకు వెళ్లి చూడగా, తన కుమారుడు రక్తపు మడుగులో పడి ఉండటం చూసి షాక్‌కు గురైంది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన వాంగ్మూలంలో అనుమానించదగ్గ అంశాలేవీ కనిపించలేదని, అయినప్పటికీ ఈ ఘటనపై అన్ని కోణాల్లో లోతుగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. చదువుల ఒత్తిడి కారణంగానే బాలుడు ఈ తీవ్ర నిర్ణయం తీసుకుని ఉంటాడని ప్రాథమికంగా భావిస్తున్నారు.