సొంత పార్టీ నేతలకు టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా పరోక్ష హెచ్చరిక
- కోల్ కతా అత్యాచార నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తే ఊరుకునేదిలేదని ఫైర్
- మహిళలపై నేరాల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని వెల్లడి
- లా కాలేజీ విద్యార్థిని కేసులో 12 గంటల్లోనే నిందితులను అరెస్టు చేసినట్లు వివరణ
అసలేం జరిగిందంటే..
'సౌత్ కలకత్తా లా కాలేజీ'లో జూన్ 25న ఓ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగినట్లు ఆరోపణలు రావడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ముగ్గురు నిందితులు మనోజిత్ మిశ్రా, జైబ్ అహ్మద్, ప్రమిత్ ముఖోపాధ్యాయ్‌లను అరెస్టు చేశారు. కోర్టు వారికి జులై 1 వరకు పోలీస్ కస్టడీ విధించింది.