కోల్ కతా అత్యాచారంపై ఆర్జీకర్ బాధితురాలి తండ్రి ఏమన్నారంటే..?
- నా కూతురిలా ఇంకెంతమంది బలికావాలి.. ఎందుకీ ఉదాసీనత?
- టీఎంసీ సర్కారుపై మండిపడ్డ ఆర్జీకర్ బాధితురాలి తండ్రి
- ఆ రాక్షసులను కఠినంగా శిక్షించాలని డిమాండ్
"రాష్ట్రంలో పదేపదే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయంటే అది తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రభుత్వ ఉదాసీనతే కారణం" అని ఆయన ఆరోపించారు. తాజా ఘటనలోనూ నిందితులు అధికార పార్టీకి చెందినవారేనని ఆయన విమర్శించారు. లా విద్యార్థినిపై అఘాయిత్యానికి పాల్పడిన ముగ్గురు నిందితులకు కఠిన శిక్ష విధిస్తేనే భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కావని ఆయన డిమాండ్ చేశారు.