జనాలను పెట్టి కోడిగుడ్లు, టమాటాలు వేయించాలనుకోవడం దారుణం: అంబటి రాంబాబు
- జగన్ పర్యటనలను అడ్డుకోవాలనుకుంటున్నారని అంబటి మండిపాటు
- జగన్ బందోబస్తు బాధ్యత పోలీసులదేనని వ్యాఖ్య
- చంద్రబాబు రాజకీయాలను చిన్నప్పటి నుంచి చూస్తున్నామని ఎద్దేవా
జగన్ బందోబస్తు ఏర్పాటు బాధ్యత పోలీసులదేనని.... జగన్ పర్యటించొద్దని అనడం కరెక్ట్ కాదని అంబటి చెప్పారు. జగన్ పర్యటనల సందర్భంగా హింస సృష్టించేందుకు చంద్రబాబు, లోకేశ్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. జనాలను పెట్టి కోడిగుడ్లు, టమాటాలు వేయించాలనుకోవడం దారుణమని అన్నారు. చంద్రబాబు రాజకీయాలను చిన్నప్పటి నుంచి చూస్తున్నామని... ఆయన రాజకీయాలకు తాము భయపడే ప్రసక్తే లేదని చెప్పారు.