అన్నామలై వర్సెస్ బీజేపీ.. కాక్రోచ్ పార్టీ నేతల అరెస్టుపై మాటల యుద్ధం!
- సీజేపీ నేతల అరెస్టుపై కేంద్రాన్ని విమర్శించిన అన్నామలై
- నిరసన తెలిపే హక్కు అందరికీ ఉందని స్పష్టీకరణ
- 2011 నాటి మోదీ వ్యాఖ్యలను గుర్తు చేసిన అన్నామలై
- నిరసనకారులను దేశ వ్యతిరేకులుగా ముద్ర వేయడాన్ని తప్పుబట్టిన అన్నామలై
- అన్నామలై విమర్శలకు వినోద్ సెల్వం కౌంటర్
సీజేపీ నేతల అరెస్టు వ్యవహారం బీజేపీలో మాటల యుద్ధానికి దారితీసింది. కేంద్ర ప్రభుత్వ చర్యలను తప్పుబడుతూ తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కె.అన్నామలై విమర్శలు గుప్పించారు. నిరసన తెలిపే హక్కును అణచివేయడం సరికాదని వ్యాఖ్యానించారు. దీనిపై తమిళనాడు బీజేపీ నేత వినోద్ సెల్వం ఘాటుగా స్పందించారు. శాంతిభద్రతలను కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు.
ఢిల్లీలో సీజేపీ నిరసనకారులపై పోలీసుల చర్యలను అన్నామలై ప్రశ్నించారు. 2011లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. అప్పట్లో రామ్లీలా మైదానంలో అవినీతి వ్యతిరేక నిరసనకారులపై అర్ధరాత్రి పోలీసుల చర్యలను మోదీ తప్పుబట్టారని పేర్కొన్నారు. అప్పట్లో కేంద్ర ప్రభుత్వంపై పోరాడేందుకు ఢిల్లీకి వెళ్లేవాడినని మోదీ అన్న విషయాన్ని ప్రస్తావించారు.
సీజేపీ నేతలు సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకా ఏడు రోజుల పాటు కస్టడీలో ఉండి బుధవారం విడుదలయ్యారు. ఈ అరెస్టుల నేపథ్యంలో అన్నామలై స్పందించారు. సీజేపీ విధానాల్లో కొన్నింటితో తాను ఏకీభవించకపోయినా, ఆ సంస్థకు నిరసన తెలిపే హక్కు ఉందని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో చట్టపరమైన విధానాలు ఉల్లంఘిస్తే ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందన్నారు.
ప్రభుత్వాన్ని విమర్శించిన వారిని దేశ వ్యతిరేకులుగా, విదేశీ శక్తుల ఏజెంట్లుగా ముద్ర వేయడం విసుగు తెప్పిస్తోందని వ్యాఖ్యానించారు. కేంద్రంలో 12 ఏళ్లకు పైగా అధికారంలో ఉన్న ప్రభుత్వం ఇంకా శత్రువులను సృష్టించుకుంటూ పోవడం సరికాదని విమర్శించారు.
అన్నామలై విమర్శలకు వినోద్ సెల్వం బదులిచ్చారు. ప్రజా శాంతిని కాపాడటం మోదీ ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. బీజేపీని వ్యతిరేకించే వారిపై చర్యలు తీసుకున్నంత మాత్రాన ప్రభుత్వ బాధ్యతను పక్కన పెట్టలేదన్నారు. శాంతియుత నిరసనలకు రక్షణ కల్పించాలని, చట్టం ఉల్లంఘనల ఆరోపణలను పరిశీలించాలని తెలిపారు. రాజకీయ అనుబంధం, సామాజిక మాధ్యమాల్లో ప్రజాదరణ ఉన్నంత మాత్రాన చట్టం నుంచి మినహాయింపు లభించదని స్పష్టం చేశారు.
2011లో మోదీ చేసిన వ్యాఖ్యలు అప్పటి పరిస్థితులకు సంబంధించినవని సెల్వం పేర్కొన్నారు. వాటిని ఆధారంగా చేసుకుని 2026లో ప్రతి పోలీసు చర్య చట్టబద్ధమైనదా? కాదా? అన్నది నిర్ణయించలేమన్నారు. కేంద్రంలో 12 ఏళ్లుగా అధికారంలో ఉన్నంత మాత్రాన శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత తగ్గదని పేర్కొన్నారు. నిరసన తెలిపే పౌరులతో పాటు ప్రజా రవాణా, రోజువారీ కార్యకలాపాలకు ఆటంకం కలగకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు.