ఏపీలో 100 మున్సిపాలిటీల ఎన్నికల ప్రక్రియకు బ్రేక్.. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎస్‌ఈసీ నిర్ణయం
- నామినేషన్ల అడ్డగింతపై వైసీపీ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ
- ఫిర్యాదులు వచ్చిన చోట్ల వాటిని పరిశీలించి, తగిన నిర్ణయం తీసుకోవాలన్న సుప్రీంకోర్టు
- ఎన్నికల ప్రక్రియపై గురువారం తుది ఉత్తర్వులు జారీ చేయనున్న ఎస్‌ఈసీ
ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల (మున్సిపాలిటీ) ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) తాత్కాలికంగా నిలిపివేసింది. రాష్ట్రంలోని మొత్తం 100 పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించి తదుపరి ఎన్నికల ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని ఆదేశిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సుప్రీంకోర్టు వెలువరించిన ఆదేశాల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
తమ పార్టీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని, నామినేషన్ల గడువును పొడిగించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం, ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని వాయిదా వేయడానికి నిరాకరించినప్పటికీ, నామినేషన్ల దాఖలులో అడ్డంకులు ఎదురైనట్లు ఫిర్యాదులు అందిన ప్రాంతాల్లో క్షుణ్ణంగా పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని ఎస్‌ఈసీని ఆదేశించింది. ఈ అంశంపై గురువారం లోగా స్పష్టత ఇవ్వాలని సూచించింది.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్‌ఈసీ అనిల్ చంద్ర పునేఠా ఈ తాత్కాలిక నిలిపివేత నిర్ణయం తీసుకున్నారు. సంబంధిత ప్రాంతాల్లోని క్షేత్రస్థాయి పరిస్థితులపై సమగ్ర నివేదికలు సమర్పించాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. ఆ నివేదికలు అందిన అనంతరం వాటన్నింటినీ పరిశీలించి, గురువారం (అక్టోబరు 22) తుది ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.