నడుచుకుంటూ వెళ్తున్న భవానీలపైకి దూసుకొచ్చిన మృత్యువు.. నలుగురు స్పాట్‌డెడ్
- కాకినాడ జిల్లా కత్తిపూడి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
- పాదయాత్రగా వెళ్తున్న భవానీ భక్తులపైకి దూసుకెళ్లిన స్కార్పియో
- ప్రమాదంలో నలుగురు భక్తులు అక్కడికక్కడే మృతి
- విజయవాడ దుర్గమ్మ దర్శనానికి వెళ్తుండగా జరిగిన విషాదం
- గాయపడిన మరో ఇద్దరిని ఆసుపత్రికి తరలించిన స్థానికులు
కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న భవానీ మాలధారులపైకి ఓ స్కార్పియో వాహనం దూసుకెళ్లడంతో నలుగురు భక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. కత్తిపూడి మండలం రవికంపాడు జంక్షన్ సమీపంలో జరిగిన ఈ దుర్ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
వివరాల్లోకి వెళ్తే.. విజయనగరం జిల్లాకు చెందిన కొందరు భవానీ భక్తులు విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం కోసం బస్సులో బయలుదేరారు. మార్గమధ్యంలో బస్సులో సాంకేతిక లోపం తలెత్తడంతో వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపివేశారు. ఈ క్రమంలో టీ తాగేందుకు సమీపంలోని హోటల్‌కు భక్తులు నడుచుకుంటూ వెళ్తుండగా, వెనుక నుంచి అతివేగంగా వచ్చిన ఓ స్కార్పియో వాహనం అదుపుతప్పి వారిపైకి దూసుకెళ్లింది.
ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో నలుగురు భక్తులు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, తీవ్రంగా గాయపడిన ఇద్దరిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.