ఏపీలో 19 మున్సిపాలిటీల ఎన్నికల ప్రక్రియకు బ్రేక్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఏపీలో 19 మున్సిపాలిటీల ఎన్నికల ప్రక్రియకు బ్రేక్

Election process for 19 municipalities in AP put on hold
  • నామినేషన్ల దాఖలును అడ్డుకున్నారంటూ వైసీపీ పిటిషన్‌ 
  • అభ్యర్థుల తుది జాబితా ప్రచురణను నిలిపివేయాలని సుప్రీం ఉత్తర్వులు
  • సుప్రీంకోర్టు సూచనలతో ఎస్ఈసీ కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్‌లో 19 మున్సిపాలిటీలలో ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) తాత్కాలికంగా నిలిపివేసింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కాసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ మున్సిపాలిటీల్లో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ, అభ్యర్థుల తుది జాబితా ప్రచురణ నిలిచిపోయాయి.

రాష్ట్రంలో అధికార పక్షం వేధింపుల కారణంగా పలు ప్రాంతాల్లో తమ అభ్యర్థులు నామినేషన్లు వేయలేకపోయారని, వారిని అడ్డుకున్నారని ఆరోపిస్తూ వైసీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. నామినేషన్ల దాఖలును అడ్డుకున్నారని, గడువు పొడిగించి తగిన రక్షణ కల్పించాలని పిటిషన్‌లో కోరింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం, ప్రజాస్వామ్యబద్ధంగా, పారదర్శకంగా ఎన్నికలు జరగడం రాజ్యాంగ మౌలిక సూత్రమని స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలో, వైసీపీ చేసిన ఫిర్యాదులను, సమర్పించిన ఆధారాలను కేసుల వారీగా పరిశీలించి అక్టోబర్ 22వ తేదీలోగా నిర్ణయం తీసుకోవాలని ఎస్ఈసీని సుప్రీంకోర్టు ఆదేశించింది. అప్పటివరకు అభ్యర్థుల తుది జాబితాను ప్రచురించవద్దని స్పష్టం చేసింది. అక్టోబర్ 25న తుది జాబితాను విడుదల చేయాలని సూచించింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులను పూర్తిగా పరిశీలించిన తర్వాతే తదుపరి చర్యలు ఉంటాయని ఎస్ఈసీ తన ప్రకటనలో తెలియజేసింది. 
Advertisement
Andhra Pradesh State Election Commission
AP Municipal Elections
Supreme Court
YSRCP
Local Body Polls
Election Postponement

More Telugu News