గోదావరి నదిలో మునిగి నలుగురు మృతి.. బాసరలో విషాదం
- హైదరాబాద్ నుంచి బాసర సరస్వతీ మాత దర్శనానికి వెళ్లిన కుటుంబం
- నదిలో స్నానానికి దిగి ఐదుగురు గల్లంతు
- నలుగురి మృతదేహాలు వెలికి తీత.. మరొకరి కోసం గాలింపు
నదిలో స్నానానికి దిగిన భక్తులు గల్లంతవడం చూసి అక్కడున్న వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన నది వద్దకు చేరుకున్న పోలీసులు.. గజ ఈతగాళ్లతో రెస్క్యూ చేపట్టారు. స్థానిక అధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు. గజ ఈతగాళ్లు నలుగురి మృతదేహాలను ఒడ్డుకు చేర్చారు. గల్లంతైన మరొకరి కోసం ఇంకా గాలిస్తున్నారు. కాగా, మృతులంతా హైదరాబాద్ లోని దిల్ సుఖ్ నగర్ వాసులని, అందరూ ఒకే కుటుంబానికి చెందిన వారని అధికారులు తెలిపారు.