మహేశ్ గౌడ్ వి చిల్లర వ్యాఖ్యలు: హరీశ్ రావు
- బీఆర్ఎస్ మాజీ నేతలను వ్యక్తిగతంగా ఎన్నడూ కలవలేదని క్లారిటీ
- ఈటలతో హరీశ్ భేటీ అయ్యారన్న కాంగ్రెస్ నేత మహేశ్ గౌడ్
- మహేశ్ గౌడ్ ఆరోపణలను ఖండించిన హరీశ్ రావు
‘‘విలువలకు తిలోదకాలు ఇచ్చి, రేవంత్ రెడ్డి బాటలోనే మీరూ నడుస్తున్నారు. బట్ట కాల్చి మీద వేసినంత మాత్రానా అబద్ధాలు నిజం అయిపోవు. పెళ్ళిలోనో, చావులోనో కలిసిన సందర్భాలే తప్ప మీరు ఆరోపించినట్లు ఇతర పార్టీ నాయకులను గానీ, మా పార్టీ నుంచి వెళ్లిన నాయకులను గాని ఎప్పుడూ వ్యక్తిగతంగా కలిసింది లేదు. విలువలతో కూడిన రాజకీయాలు చేస్తాను తప్ప, మీ లాగా చిల్లర రాజకీయాలు చేసి లబ్ధి పొందాలని చూడను. ఇలాంటి ఆరోపణలు మానుకొని స్థాయికి తగ్గట్లు వ్యవహరించాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలుపై దృష్టి పెట్టాలని మహేష్ కుమార్ గౌడ్ కు సూచిస్తున్నాం’’ అంటూ హరీశ్ రావు ‘ఎక్స్’ లో పోస్ట్ పెట్టారు.