విశాఖ స్టీల్ ప్లాంట్ లో తప్పిన పెను ప్రమాదం .. 300 ట్రక్కుల ద్రవ ఉక్కు నేలపాలు
- విశాఖ స్టీల్ ప్లాంట్ బ్లాస్ట్ ఫర్నెస్ - 2 లో ప్రమాదం
- కాలిపోయిన కేబుల్స్, దెబ్బతిన్న ట్రాక్
దీంతో మంటలు చెలరేగి కేబుల్స్ కాలిపోయి, ట్రాక్ దెబ్బతింది. అయితే, ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.
ఈ ప్రమాదంపై స్టీల్ ఇంటర్ అధ్యక్షుడు పి.వి. రమణమూర్తి, సీఐటీయూ ప్రధాన కార్యదర్శి యు. రామస్వామి స్పందిస్తూ, ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని, నిపుణులైన సిబ్బందితో పనులు చేయించాలని డిమాండ్ చేశారు.