జమ్మూకశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు.. రాత్రంతా ప్రశాంతం
- జమ్మూ నగరం, పూంచ్ ప్రాంతంలో ఈ ఉదయానికి సాధారణ పరిస్థితులు
- నమోదు కాని డ్రోన్లు, కాల్పులు, షెల్లింగ్ ఘటనలు
- పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో మాత్రం కొనసాగుతున్న రెడ్ అలెర్ట్
కాగా, పంజాబ్‌లోని అమృత్‌సర్ జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇళ్లకే పరిమితం కావాలని కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు. ప్రజల సౌకర్యార్థం విద్యుత్ సరఫరాను పునరుద్ధరించామని, అయినప్పటికీ రెడ్ అలెర్ట్ కొనసాగుతోందని, రెడ్ అలెర్ట్‌కు సూచనగా సైరన్లు మోగుతాయని, ఇళ్ల నుంచి బయటకు ఎవరూ రావద్దని, కిటికీల వద్దకు కూడా వెళ్లవద్దని ఆదేశాల్లో పేర్కొన్నారు. తదుపరి ఆదేశాలు జారీచేసే వరకు అందరూ ఈ నిబంధనలు పాటించాలని, ఎవరూ ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు.