పాక్ లో పెట్రోల్ బంక్ లు క్లోజ్.. ఇంధన కొరతతో విలవిల
- రెండు రోజుల పాటు బంకులు మూసివేయాలని నిర్ణయం
- యుద్ద వాతావరణం నేపథ్యంలో నిల్వలు పెంచుకోవడం కోసమేనని సమాచారం
- దాడులు కొనసాగిస్తే దేశంలో నిత్యావసరాలకూ ఇబ్బంది తప్పదంటున్న నిపుణులు
పాకిస్థాన్ ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో కుదేలవగా భారత్ తో యుద్ధ వాతావరణం మరింత అల్లాడిపోయేలా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే నిత్యావసరాల కొనుగోలుకు కూడా పాక్ ప్రభుత్వం వద్ద ఆర్థిక వనరులు ఉండవని అంటున్నారు. ఈ క్రమంలోనే పాకిస్థాన్ అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్‌ఎఫ్) ముందు మరోసారి సాయం కోసం అర్థించింది. ఒక బిలియన్ డాలర్ల సాయాన్ని అందించేందుకు ఐఎంఎఫ్ అంగీకరించిందని పాక్ ప్రధాని కార్యాలయం తెలిపింది.