Arshi: గడ్డం తెచ్చిన తంట .. మరిదితో ఉడాయించిన మహిళ
- గడ్డం (షేవింగ్) చేసుకోవాలని భర్తను కోరిన భార్య అర్షి
- గడ్డం తీసేందుకు ససేమిరా అంటూ మొండికేసిన భర్త షకీర్
- తమ్ముడితో అర్ధాంగి లేచిపోవడంతో పోలీసులను ఆశ్రయించిన షకీర్
ఉత్తరప్రదేశ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ యువతి చిన్న కారణంతో భర్తను వదిలి మరిదితో ఉడాయించింది. మేరఠ్‌లోని లిసాడి గేట్ ప్రాంతానికి చెందిన మౌలానా షకీర్‌కు అర్షితో ఆరు నెలల క్రితం వివాహం జరిగింది. 12వ తరగతి వరకు చదువుకున్న ఈ యువతి ప్రస్తుతం కళాశాలలో విద్యను అభ్యసిస్తోంది.
వివాహం జరిగిన తొలి రాత్రే అర్షి తన భర్త గడ్డంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. గడ్డం తీయమని కోరింది. అయితే మౌలానా షకీర్ గడ్డం తీసేది లేదని తేల్చి చెప్పాడు. ఈ విషయంపై వారి మధ్య చాలాసార్లు గొడవలు జరిగాయి. మరోవైపు క్లీన్ షేవ్‌తో కళ్లెదుటే తిరుగుతున్న మరిదిపై అర్షి మనసు పారేసుకుంది. భర్త షకీర్ ప్రతిరోజూ ఉదయం పనికి వెళ్ళిన తర్వాత ఇంట్లో అత్త, మరిది మాత్రమే ఉండేవారు.
ఈ క్రమంలో ఆమె మరిదికి దగ్గరైంది. ఇద్దరూ కలిసి ఇంటి నుంచి పారిపోయారు. ఈ విషయం గురించి షకీర్, అర్షి తల్లిదండ్రులకు చెప్పగా, తమ కూతురితో ఇకపై తమకు ఎలాంటి సంబంధం లేదని వారు తెగేసి చెప్పారు. భార్య తీసుకున్న ఈ నిర్ణయంతో షాక్‌కు గురైన షకీర్ పోలీసులను ఆశ్రయించాడు. షకీర్ ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.