వైభవ్ సూర్యవంశీపై సచిన్, రోహిత్ ప్రశంసలు
జీటీపై రికార్డు సెంచరీ చేసిన సూర్యవంశీపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సచిన్, రోహిత్, సూర్యకుమార్, షమీ తదితరులు అతనిపై ప్రశంసలు కురిపించారు.
"వైభవ్ నిర్భయమైన విధానం, బ్యాట్ వేగం, ముందుగానే లెంగ్త్ ఎంచుకోవడం, బంతిని బలంగా బాదడమే అద్భుతమైన ఇన్నింగ్స్ కు కారణం. 38 బంతుల్లో 101 పరుగులు. బాగా ఆడాడు" - సచిన్ టెండూల్కర్
"వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ 'క్లాస్' "- రోహిత్ శర్మ
"ఈ యువకుడి ఇన్నింగ్స్ తో ఊచకోత అంటే ఏంటో తెలిసివచ్చింది. నిజంగా అద్భుతమైన టాలెంట్" - సూర్యకుమార్ యాదవ్
"వైభవ్ సూర్యవంశీ, ఎంత అద్భుతమైన ప్రతిభ. కేవలం 14 ఏళ్ల వయసులో సెంచరీ చేయడం నమ్మలేకపోతున్నా. ఇలాగే కంటిన్యూ చేయండి బ్రదర్" - మహ్మద్ షమీ